భారతీయ మజ్దూర్ సంఘ్ 20వ త్రైవార్షిక జాతీయ మహాసభలు బీహార్ రాజధాని పాట్నలో బియంయస్ జాతీయ అధ్యక్షులు శ్రీ హిరన్మయ్ పాండ్య అధ్యక్షతన ప్రారంభం అయినాయి . వందేమాతరం గీతం తో కార్యక్రమం మొదలు అయ్యింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కేంద్రీయ కార్యక్రమాలకారిణి సభ్యులు శ్రీ వి. భాగయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేసి బియంయస్ కార్మికుల సంక్షేమం కొరకు, సమస్యల పరిష్కారం గురించి రాజకీయాలకు అతీతంగా పనిచేయటం వలన దేశంలో అన్ని కార్మిక సంఘాల కంటే అగ్రస్థానంలో వుందని అంతే కాకుండా ప్రపంచ దేశాల కార్మిక సంఘాలలో ఒక ప్రత్యేకత సాధించుకునే స్థాయికి ఎదిగిందని అన్నారు. బియంయస్ సభ్యులు హక్కుల తో పాటు బాధ్యత కూడా వహిస్తారని ,దేశం కొరకు పనిచేస్తున్నామని భావన కలిగిఉంటారు అని అన్నారు. మహాసభల ఉద్ఘాఠన లో బియంయస్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ రవీంద్ర హింతే,ఉపాధ్యక్షులు శ్రీమతి నీట చౌబే తదితరులు పాల్గొన్నారు.దేశం నలుమూలలనుంచి 2 వేలమంది ప్రతినిధులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment